*** బంధం ***
కోయిల కూసిన వేళలో చూస్తే వచ్చింది మంగళగిరి,
ఆశీస్సులు అందిస్తున్నట్లు చూస్తున్న ఆ గాలి గోపురం,
పచ్చని పైరుల అందాలలో తడిసి ముద్దైన విజ్ఞాన విహారం,
ప్రయాణంలో కనిపించిన అప్పుడే నిద్ర లెగిసిన నూతక్కి గ్రామం,
చెలిని త్వరగా కలవాలంటూ తహతహలాడుతున్న హృదయం,
నింగికి ఎర్రని రంగు పూస్తున్న సూర్యుని కిరణాలలో,
కళ్ళ ముందుకు వచ్చేసింది పెళ్ళికి ముస్తాబైన పాలెం లోని నిలయం!
ఆ ముందు రోజు దసరా తెచ్చిన సంబరాల వేల,
ఏడడుగుల ప్రయాణం ఒక జీవిత కాలపు ప్రాయం అయిన వేల,
అతిథుల ఆశీస్సులు శ్రీ రామరక్ష అయిన వేల,
విద్యుత్తు కాంతుల రూపంలో సూర్యుడు దీవించగా,
పారాణి పూసిన రంగులలో, కళ్యాణ తిలకం తీసుకొచ్చిన అందంలో,
ప్రియ సఖిగా వచ్చిన కొత్త పెళ్లి కూతురి అడుగులలో,
వధువు పెట్టుకున్న సిగ్గు తోటలోని పూలలొ,
నా వధువు మొదటిసారి సిగ్గుతో కళ్ళు పైకెత్తి చూసిన వేల,
చివరి అడుగు వరకూ వదలనన్న చెయ్యి తో కట్టిన మాంగల్యం,
నా మరదళ్ళు, చెల్లెళ్ళ ఆట పట్టింపులతో
నా వధూమణికి వాళ్ళు పెట్టిన చక్కలిగిలిలో,
ఎప్పటికీ ఈ నవ్వులు ఆగకూడదని ఆడిన ఆట,
దసరా సంబరాల్ని మరిపించే ఆ సమయంలో,
ముడి పడింది వివాహ బంధం!
విందు భోజనాల ఆహ్లాదకర రుచులలో,
ముడి పడింది ఒక ప్రేమ బంధం.
నింగిన విరిసిన మల్లె పువ్వుల చుక్కల పందిరిలో,
అనంత లోకాలలోని అరుంధతి నక్షత్రం మమ్మల్ని దీవించిన వేల,
పెళ్లి కూతురు జడలోని మల్లె పూల పరిమలంలోని ఆహ్లాదంలో,
ముడి పడింది ఒక జీవిత కాలపు ప్రేమ బంధం!
తుది శ్వాస వరకూ కలిపి వుంచే ఆ విడదీయలేని బంధం!
-మీ అనిల్ :)