"వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి"
సాక్షాత్తు ఆ తెలుగు తల్లి మెడలోని పదాల హారంలోని ముత్యాలలాగా వేటూరి గారు ఎన్నో అందమైన పాటలు వ్రాసారు.
అందుకేనేమో. తెలుగు తల్లి తన చేత దగ్గరుండి మరిన్ని పాటలు వ్రాయిచుకోవాలని తనను తీసుకెళ్ళిపోయింది.
వేటూరి గారంటే ఒక రచయితే కాదు. ఒక వ్యక్తిగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న మహా కవి.
ఆయన ఎన్ని పురస్కారాలు అందుకున్నారో అనేకన్నా ఆయనకు తెలుగు భాష మీద వున్న ప్రేమ, ఎంత మంది మనస్సులను ఆకట్టుకున్నారో అనేది తెలుసుకోవాల్సిన విషయం.
మన అచ్చ తెలుగు భాషలోని మాధుర్యాన్ని చాటిచెప్పుతూ ఆయన వ్రాసిన గేయాలెన్నో. ఈ కాలం వున్నంతకాలం అవి గుర్తుండిపోతాయి.
ఒక "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" కానీ, "యమహా నగరి" కానీ, "ఉప్పొంగెలే గోదావరి" కానీ, అలా చెప్పుకుంటే ఆయన వ్రాసిన ఎన్నో పాటలు ఎప్పటికీ మాసిపోని సంపదగా నిలిచిపోతాయి.
తెలుగు భాష తియ్యదనాన్ని మనందరికీ చూపించిన మహా కవి వేటూరి గారికి ఇదే నా అశ్రునివాళి.
తనికెళ్ళ భరణి మాటల్లో: "సాదా సీదా పదాలు వేటూరిని చేరి పరవసించిపోతాయి పాటలైపోయి!"
అలాగే అదే శనివారాన మంగళూరు లో జరిగిన గగన విషాదాన్ని చూడలేక ఆకాశం కూడా కన్నీరు పెట్టుకుంటూ చినుకుల్లా కురుస్తుందేమో అనిపించింది. వారందరికీ ఇదే నా ప్రగాఢ సానుభూతి...